జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలింటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీరియస్ అయిన ప్రభుత్వం.. గుంటూరు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది.
రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలోనే పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. అంతేకాకుండా.. భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన కన్ను పడింది.
టీడీపీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని విమర్శించారు. విధ్యంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు... వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు…
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు డైలమాలో ఉన్నాయి. హెలీపాడ్ ఏర్పాటుకు అధికారులు అనుమతుల నిరాకరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం పర్యటనను పవన్ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. ఇటు.. అమలాపురంలోనూ హెలీపాడ్ ఏర్పాటుకు ఆర్ అండ్ బీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vyooham Trailer: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 'వ్యూహం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.