Ustaad Bhagath Singh:దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఏపీ ఎలక్షన్స్ హీటెక్కిపోతుంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా.
నిన్న ( ఆదివారం ) ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ- బీజేపీ- జనసేన ఉమ్మడి సభ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెంఇన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు.
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.