Pothina Mahesh Quits Janasena: జనసేనకు బిగ్ షాక్.. పోతిన మహేష్ గుడ్ బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pothina Mahesh Quits Janasena: ఎన్నికల తరుణంలో జనసేన పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్.. జనసేనకు గుడ్‌బై చెప్పారు.. అయితే, బెజవాడ పశ్చిమ సీటు ఆశించారు పోతిన మహేష్.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదురిన తర్వాత.. ఆ సీటు బీజేపీకే కేటాయిస్తారనే ప్రచారం సాగింది.. ఊహించినట్టుగానే పొత్తులో భాగంగా పశ్చిమ సీటు బీజేపీ నుంచి సుజనా చౌదరికి కేటాయించింది ఎన్డీయే.. కానీ, ఆ సీటును తనకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు పోతిన మేహష్.. తన అనుచరులతో కలిసి నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అధిష్టానం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో.. చివరకు పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది..
Read Also: Allahabad High Court: హిందూ వివాహానికి ఏడడుగులు తప్పనిసరి.. ‘కన్యాదానం’ అవసరం లేదు.. హైకోర్టు తీర్పు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కాగా, 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్.. ఓటమి పాలయ్యారు.. ఈసారి మళ్లీ పోటీ చేసి.. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు.. టీడీపీ నుంచి కూడా ఈ స్థానం కోసం గట్టిపోటే నడిచింది.. టీడీపీ నేతలు వెనక్కి తగ్గినా.. పోతిన మహేష్ మాత్రం.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు.. ”జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకు మరియు క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇప్పటి వరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జనసైనికులకు మరియు పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు” అంటూ లేఖలో పేర్కొన్నారు పోతిన వెంకట మహేష్. అయితే, జనసేనకు గుడ్‌బై చెప్పిన పోతిన మహేష్.. రాజకీయ అడుగులు ఎటువైపు వేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!