పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తేనే నేను సహకరిస్తాను.. వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు ఓటమి కొత్త కాదు అని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో.. సినిమాలకు బ్రేక్ చెప్పి, ప్రచారాలకు ఎక్కువ సమయాన్నీ కేటాయిస్తున్నారు. ఇక ఎప్పటినుంచో అప్డేట్ అడుగుతుంటే.. తరువాత తరువాత అని వెనక్కి తగ్గే హరీష్ శంకర్.. ఈరోజు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు.
ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్.. ఆ కూటమికి ఓటేస్తే 4శాతం రిజర్వేషన్ పోయినట్లే టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీకి ఓటు వేస్తే ముస్లింల 4 శాతం పర్సెంట్ రిజర్వేషన్ పోయినట్లే అని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో గందరగోళం చేశారు.. ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకొని నీచంగా మాట్లాడుకున్నారు అని ఆయన…
మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండే పరిస్థితి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి.. రాష్ట్రం కోసం రావాలని కోరాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని చాలా మంది ఆహ్వానించారు.. కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. 2019 లోనే పోటీ చేయమంటే నేను ఆలోచించాను.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే పిఠాపురం ప్రత్యేకమైనది అని ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే పవన్ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇన్నాళ్లకు ఈ కాంబో ఉస్తాద్ తో రాబోతుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.