Megastar Chiranjeevi Huge donation to Jana Sena party: ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆయన తెలుగుదేశం బిజెపితో కలిసి పొత్తులో ఉన్నారు. పవన్ జనసేన దాదాపు 21 స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలోకి దించింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంకి వెళ్లిన ఆయన అక్కడ ఎండ దెబ్బకు గురయ్యారు. కాసేపు సొమ్మసిల్లిన పరిస్థితిల్లో ఆయన తేరుకున్నాక హైదరాబాద్ వచ్చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈరోజు హైదరాబాద్ కి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి అనే ప్రాంతానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అక్కడ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
Dhanush Divorce: అభిమానుల ఆశలన్నీ వమ్ము.. సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్
ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుండగా మెగాస్టార్ చిరంజీవిని కలిసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అన్నదమ్ములు ఇద్దరూ కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమారు 5 కోట్ల రూపాయల వరకు మెగాస్టార్ చిరంజీవి జనసేన కోసం విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని చిరంజీవి కానీ సినిమా యూనిట్ కానీ జనసేన కానీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఒక అధికారిక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుపొందుతాడని, అలాగే మిగతా అన్ని స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు గెలవాలని తాను కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పవన్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.