ఏపీల బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేపడుతోంది.
ఈ సారి రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఉత్కంఠ వీడింది. రాజోలు అభ్యర్థిగా.. మాజీ ఐఎఎస్ దేవ వరప్రసాద్ను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తేనే నేను సహకరిస్తాను.. వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు ఓటమి కొత్త కాదు అని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు.