Pothina Mahesh: జనసేన పార్టీకి షాక్ ఇస్తూ.. రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ జనసేన ఇంఛార్జ్‌గా ఉన్న పోతిన మహేష్.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో జనసేన, పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి రాజీనామా ఆవేశంలో చేయలేదు.. సీటు రాలేదని నేను రాజీనామా చేయటం లేదన్నారు. పవన్ కొత్తతరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేశాం.. 2014లో పోటీ చేయక పోయినా, 2019లో ఒక సీటు వచ్చినా పవన్ తో నడిచి మేం భంగపడ్డాం అని ఆవేదన వ్యక్తం చేశారు.. నటించే వాడు నాయకుడు అవ్వలేడు.. నమ్మకం కలిగించే వాడు మాత్రమే నాయకుడన్న ఆయన.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్.. ఇలాంటి పాషాన హృదయం కలిగిన వ్యక్తితో ప్రయాణం చేసిన మాకు మాపై అసహ్యం కలుగుతోందన్నారు.
Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందనే, గాజా నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ..
పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఎప్పుడూ పవన్ కల్యాణ్ దృష్టి పెట్టలేదన్నారు మహేష్.. పవన్ ది అంతా నటనే.. అన్నీ తాత్కాలికమేనన్న ఆయన.. పవన్ ను నమ్మి నెట్టేట మునిగిపోయాం.. పవన్ గురించి నాకంటే ప్రజలకు బాగా తెలుసు.. అందుకే ఆయన్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారని ఫైర్ అయ్యారు. 25 ఏళ్ల భవిష్యత్ ఉందన్న పార్టీకి పవన్ 25 సీట్లు కూడా సాధించలేక పోయారు.. పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలవుతున్నాయి.. జనసేన పార్టీ ఇంకో 20 ఏళ్లు కొనసాగుతుందని నమ్మకం ఎవరికీ లేదన్నారు. జనసేన పార్టీ కాలం త్వరలోనే చెల్లుతుంది.. పవన్ నడవడికలో లోపం ఉంది, మీ చూపులో ద్వంద్వ అర్ధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Allu Arjun Birthday : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. అదిరిపోయే లుక్ లో స్నేహారెడ్డి..
జనసేనలో పనిచేసే ఎవరికి టికెట్స్ ఇవ్వకుండా టీడీపీ వారికి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోతిన.. ఇక, పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని బలి ఇస్తున్నారు.. పవన్ మా గొంతు కోయటం ఆపాలి.. రాజకీయాల్లోకి వచ్చి మేం ఆస్తులు అమ్ముకుంటే.. పవన్ ఆస్తులు కొన్నారు.. నా దగ్గర ఇందుకు ఆధారాలు ఉన్నాయి.. వాటిని త్వరలోనే బయట పెడతాను అని ప్రకటించారు. జనసేన వీర మహిళలను మోసం చేయాలని ఎలా అనుకున్నారు పవన్? అని నిలదీశారు. పవన్ టీడీపీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టికెట్లను ఇచ్చారని ఆరోపించారు. జనసేన ప్రజారాజ్యం పార్టీ 2 అవుతుందని.. 12 నెలల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. త్యాగాలు చేయటానికి బీసీలు మాత్రమే కావాలా? పవన్ కల్యాణ్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.. భీమవరం సీటు కూడా జనసేనకు ఇవ్వకుండా టీడీపీకి ఎందుకు ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు పోతిన మహేష్.