Chiranjeevi and Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి మా వాడే.. కాంగ్రెస్ పార్టీయే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోమవారం రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మెగాస్టార్ చిరంజీవిని కలవడం.. జనసేనకు చిరంజీవి భారీ విరాళం ఇవ్వడంపై స్పందించారు.. అయితే, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వాడే.. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని.. ఏఐసీసీ సభ్యులుగా చిరంజీవి కొనసాగుతున్నారని గుర్తుచేశారు. తమ్ముడు అనే కారణంతోనే పవన్ కల్యాణ్‌కి చిరంజీవి సహాయం చేసి ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ, దీనిపై కొందరు చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, రాజకీయ వ్వూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ మండిపడ్డారు.. ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఫెయిల్ అయ్యాయన్నారు. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు గిడుగు రుద్రరాజు.
Read Also: Sree Vishnu New Movie: పండగ వేళ శ్రీవిష్ణు కొత్త సినిమా ఆరంభం!
కాగా, హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ‘విశ్వంభర’ షూటింగ్‌లో ఉన్న తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవితో పవన్ కల్యాణ్ సమావేశమైన విషయం విదితమే.. తమ మరో సోదరుడు నాగబాబుతో కలిసి వెళ్లిన పవన్.. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల ప్రచారంలో ఉన్న తమ్ముడిని చిరంజీవి ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ కల్యాణ్.. ఇక, జనసేనకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ఇచ్చారు. జనసేన పార్టీకి తన వంతు విరాళంగా 5 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి.