ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు నివశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్తుంటారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే దానిపై భారత విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, సౌదీ అరేబియాలో 1363…
తెలుగు రాష్ట్రాల్లో విభజన రచ్చ జరుగుుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో ఏపీ విభజన గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ అజెండాలో ఏపీ విభజన సమస్యలు అంశాన్ని చేర్చడం సంతోషకరం అన్నారు. అది మా ఆకాంక్ష.…
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వ్యవహారం మరోసారి పార్లమెంట్లో కాకరేపింది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులే అంటూ రాజ్యసభలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.. ప్రధానంగా రెండు అంశాలపై మాట్లాడారు…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాష్ట్రపతి. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి. రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ కి ఇది చివరి ప్రసంగం కావడం విశేషం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు రాష్ట్రపతి. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోంది. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నాం…
ఇవాళ్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం అవుతుంది. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ…
సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఇదే చివరి ప్రసంగం కానుంది. ఎందుకంటే ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం.. లోక్‌సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. Read Also: రైల్వే శాఖ కీలక నిర్ణయం: నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉ. 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి…