పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. Read Also: రైల్వే శాఖ కీలక నిర్ణయం: నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉ. 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్సభ సమావేశాలను షిఫ్ట్లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్లో 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. పార్లమెంట్లో పనిచేస్తున్నా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికోసం ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Read: మనిషి…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో కరోనా కలకలం రేగింది. గత రెండు రోజులుగా పార్లమెంట్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా టెస్టులు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో 350 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 350 మంది సిబ్బందికి…
తెలంగాణలో రచ్చరేపుతోంది జీవో నెంబర్ 317. ఈ జీవో పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 371 డి ని పార్లమెంట్ లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని కోర్టుకు తెలిపారు పిటిషనర్. 317 జీవో పై స్టే ఇవ్వాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య. స్టే ఇవ్వడానికి నిరాకరించారు…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ నిరవధికంగా వాయిదా పడ్డాయి.. ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి.. శీతాకాల సమావేశాల్లో లోక్సభలో 18 గంటల 48 నిమిషాల పాటు సభా సమయం వృథా అయినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీలకమైన బిల్లుల గురించి చర్చ జరిగిందన్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందినట్లు ఆయన చెప్పారు. లోక్సభలో ఒమిక్రాన్, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిగినట్లు ఓం బిర్లా…
నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి… ఓ వైపు 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్, మరోవైపు వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలతో హాట్ హాట్గా సాగిన పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడనున్నాయి.. ఇక, మంగళవారం సభలో ప్రవేశపెట్టిన “బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు 2021”ను స్టాండింగ్ కమిటీకి పంపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం…
మహిళాల వివాహా వయస్సును 18 నుంచి21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు సంబంధించిన , బాల్య వివాహా సవరణ బిల్లును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు పై పలు విమర్శలు వస్తున్నాయి. మహిళల స్వేచ్ఛను హరించడమేనని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వివాహా వయస్సును తగ్గించి పెంచడం మంచిది కాదని విపక్షాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించాలని చూస్తున్నాయి. 18 ఏళ్లకే ఓటు…
దశాబ్దాలుగా ఉన్న ఎన్నికల సవరణ చట్టాల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఓటర్ కార్డుతో-ఆధార్ అనుసంధాన బిల్లును లోక్ సభలోసోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మొదటినుంచి విపక్షాలు అడ్డుకోవాలని చూసినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యంగా బోగస్ ఓట్లను గుర్తించడానికి వాటికి చెక్ పెట్టేందుకు దీనిని తీసుకొస్తున్నామని ప్రకటించినా విపక్ష సభ్యులు తమ ఆందోళనలను మాత్రం విరమించలేదు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు…