రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్.
ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు భిక్షమయ్య గౌడ్. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా అండగా నిలిచారు. టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోపాటు బీజేపీ గెలుపు కోసం తమవంతు క్రుషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్నారు.
కొడుకు సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటుంటే.. కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. దీని గురించి సీఎం ఎందుకు స్పందించడం లేదు. డ్రగ్స్ విషయంలోనూ కఠిన చర్యలేవి? మొక్కుబడిగా సమావేశాలు పెట్టి హడావిడి చేయడం తప్ప సమస్యను పరిష్కరించిన దాఖలాల్లేవు. ప్రజల చర్చలను దారి మళ్లించేందుకే ధాన్యం పేరుతో నాటకాలాడుతున్నారు.
TS: హస్తిన నుంచి గవర్నర్ తమిళిసైకి పిలుపు.. ఏం జరుగుతోంది..?
జంతర్ మంతర్ కాదు కదా టీఆర్ఎస్ నేతలు విదేశాల్లో ధర్నాలు చేసుకున్నా వచ్చే ఇబ్బందేమీ లేదు. అయినా మేం ధాన్యం కొనబోం అని చెబితే కదా.
కేంద్రం ఎంత రారైస్ ఇచ్చినా కొనేందుకైనా సిద్ధంగా ఉంది. పీయూష్ గోయల్ కూడా పార్లమెంట్ లో ప్రకటించారు. వరి పంట వేయాలని చెప్పేది వాళ్లే… సన్న వడ్లు వేయాలని చెప్పింది వాళ్లే. ఆ తరువాత మాట మార్చి వరి వేస్తే ఉరే గతి అన్నది వాళ్లే అన్నారు బండి సంజయ్.
ధాన్యం కేంద్రానికి పంపేది లేదని చెబుతోంది వాళ్లే. ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తామని చెప్పింది వాళ్లే. ఇప్పుడు కేంద్రమే కొనాలంటూ గోల చేస్తోంది వాళ్లే. కరెంట్ బిల్లుల విషయంలో ప్రజలను దారి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు బండి సంజయ్జ్.