పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు కీలక వ్యాఖ్యాలు చేశారు పీటీఐ నేతలు.. పార్లమెంట్ దిగువ సభలో పీటీఐ మెజారిటీ కోల్పోయిన తర్వాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు పోరాడతారని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. మాజీ క్రికెటర్ అయిన తన ప్రధాని గురించి.. చివరి బంతి వరకూ తన పోరాటం చేస్తారంటూ క్రికెట్ స్టైల్‌లో చెప్పేశారు.. ఇక, ఇవాళ సాయంత్రం ఇమ్రాన్‌ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ దేశ దేశీయాంగ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు.. 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు 172 మంది సభ్యుల బలం అవసరం… తాజా పరిస్థితులను చూస్తే.. విపక్షానికి 175 మంది సభ్యులు మద్దతు ఉన్నట్టుగా తెలుస్తుంది.
Read Also: Electricity Charges Hike: ఏపీలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. ఇలా వడ్డింపు..