Central Government answer on special package to andhra pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఇటీవల పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రత్యేక ప్యాకేజీపై కీలక ప్రకటన చేసింది. ఏపీకి 2016లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇప్పటివరకు 17 ప్రాజెక్టుకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి రూ.7,797 కోట్ల రుణం అందించామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్…
భారత 14వ రాష్ట్రపతిగా సేవలు అందించిన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం ఘనంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఇతర కేంద్రమంత్రులు, రాజ్యసభ,లోక్ సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ నుంచి దిగిపోతున్న క్రమంలో ఆయన దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు.
Telugu Desam Party MP Ram Mohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నికలు జరగడంతో పార్లమెంట్ హాలు సందడిగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ క్రికెటర్లలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీసుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల రాజ్యసభకు పంజాబ్ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అటు ఇప్పటికే…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 18 నుంచి ఆగష్టు 12 వరకు ఈ సెషన్ కొనసాగనుంది. అ
భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పార్లమెంట్. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ జరగనుంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. బ్యాలెట్ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది.
జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ నేతలకు వివరించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఈ నెల 18వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఇక, ఆదే రోజు రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగోబుతున్నాయి.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్న నేపథ్యంలో.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి.. ఇదే, సమయంలో.. వారిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది అధికార పక్షం.. ఇక, ఈ సారి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు……
ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఏంపీలకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.కాగా.. కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్…