ఢిల్లీలో జరిగిన ఓ పరిణామం.. మహారాష్ట్రలోని సంకీర్ణంలో హీట్ పుట్టించింది.. ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. పార్లమెంట్‌లోని ప్రధాని మోడీ కార్యాలయంలో ఇద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అయితే, ఈ సమావేశంలో మహారాష్ట్ర అధికార సంకీర్ణ నాయకులు మరియు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర రాజకీయ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను లేవనెత్తినట్టుగా తెలుస్తోంది.. మనీలాండరింగ్ కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్,…
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో…
రాహుల్ తో భేటీ కోసం ఢిల్లీ వెళ్ళిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు.ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనం లా మారింది.కేసీఆర్ సంతకం మరణశాసనం లా…
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్. ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు…
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు కీలక వ్యాఖ్యాలు చేశారు పీటీఐ నేతలు.. పార్లమెంట్ దిగువ సభలో పీటీఐ మెజారిటీ కోల్పోయిన తర్వాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు పోరాడతారని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. మాజీ క్రికెటర్ అయిన తన ప్రధాని గురించి.. చివరి బంతి వరకూ తన పోరాటం చేస్తారంటూ క్రికెట్ స్టైల్లో చెప్పేశారు.. ఇక, ఇవాళ సాయంత్రం ఇమ్రాన్‌ఖాన్ జాతిని…
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది.. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించినా.. ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి.. అయితే, ఇవాళ పాక్ పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక, ఆ అవిశ్వాన తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్…
పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడం.. ముగియడం జరిగిపోయాయి.. తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగగా.. తొలి రోజున రాష్ట్రపతి ప్రసంగం.. ఆ తర్వాత ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించడం.. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక, ఈ నెల 14వ తేదీ నుంచి బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. అయితే,…
చట్టాలు చేయాల్సిన సభల్లో విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి.. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన చోట.. వాదోపవాదాలు సాగుతున్నాయి.. నిరసనలు, ఆందోళనలు, ఇలా అట్టుడికిపోతున్నాయి చట్ట సభలు.. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ప్రజా ప్రతినిధులు చట్టసభల గౌరవాన్ని కాపాడాలని సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలన్నారు.. చట్టసభల్లో చోటు చేసుకుంటున్న అంతరాయాలు, ఇతర పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్య. Read Also: Ukraine Russia…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీయే. అసలు నేతాజీ ఏమయ్యారన్నదానిపై అనేక కథనాలు… ఇంకెన్నో సందేహాలు ఉన్నాయి. ఇంతకీ నేతాజీ గురించి తెలుసుకోడానికి మనం ఏం చేశాం? ఆ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలించాయనే దానిపై కేంద్రం వివరణ ఇచ్చింది. నేతాజీ గురించి వివిధ దేశాల్లో ఉన్న రికార్డులు, దస్త్రాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేసినట్టు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ ఈ విషయం తెలిపారు.…
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం అనేక నిబంధనలు అమలులోకి తెచ్చింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ కనిపించేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిప్తారు. వారికి చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదంటోంది కేంద్రం. అయితే అందుకు కొన్ని షరతులు పెట్టింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. మొబైల్‌ను నేరుగా…