మాదిగలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామన్నారు మందకృష్ణ మాదిగ. మాదిగల సంగ్రామ పాదయాత్రను ప్రారంభించిన మందా కృష్ణమాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకూ 88 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు ముందుకు రానిపక్షంలో ఎందుకు పార్టీ తీర్మానాలు చేసారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు.
బీజేపీ పాలకులకు చిత్త శుద్ధి లేదు. మాదిగలను మరో ఉద్యమానికి సిద్దం చేసేందుకు , కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే మహాసంగ్రామ యాత్ర చేపట్టామన్నారు మందకృష్ణమాదిగ. ఎస్సీ రిజర్వేషన్ కు నాయకత్వం వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్నాం.
సమస్య పరిస్కారం కాకుంటే ఏపీ తెలంగాణలో బీజేపీ నేతలు ఎలా తిరుగుతారో చూస్తాం అన్నారు. వందలాది బహిరంగ సభలలో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వర్గీకరణకు మద్దతు తెలిపింది. అధికారం చేపట్టి ఎనిమిది సంవత్సరాలైనా షెడ్యుల్ కులాల వర్గీకరణ సమష్యను బీజేపీ పరిష్కరించలేదన్నారు. ఒక రూపాయి భారం పడని సమస్య ఏబీసీడీ వర్గీకరణ. మాదిగలకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు.
TIGER HUNT: ఆ పులి ఎక్కడ.. అధికారుల అన్వేషణ