ఓటర్ జాబితా నుంచి బోగస్ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యం అంటూ ఓటరు కార్డు-ఆధార్ కార్డు అనుసంధానికి సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించగా.. ఇక, ఇవాళ లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు… పౌరుల ఎలక్టోరల్ కార్డులతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని బిల్లు కోరగా, దానిని ప్రవేశపెట్టడాన్ని మాత్రం ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు శాసన సామర్థ్యాలకు మించినదని…
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించిందని…. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది. Read Also: ఎన్నికల…
దేశంలో చట్టసభల్లో వాతావరణం కలుషితం అవుతోందని, భుజబలం చూపించడం ఎక్కువైందన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. “గాంధీ టోపీ గవర్నర్” పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలు “తాలింఖానాలు” కావని, బుద్ధి బలం చూపించి ఎంతటి శక్తి వంతమైన ప్రభుత్వాలనైనా గడగడలాడించవచ్చన్నారు. ఇటీవల సభ్యులు తమ ప్రవర్తన పై చింతించకుండా సమర్ధించుకోవడం బరితెగింపు…
తెలంగాణ పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ మూడు రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకారణంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో సింగరేణికి సుమారు రూ. 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. లోక్‌సభలో ఈరోజు జీరో అవర్‌లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బోగ్గుగనుల వేలం…
భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది…
ఎయిర్టెల్ ఓ చెత్త రికార్డు సృష్టించింది.. అదేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే.. తమకు సర్వీసులో తలెత్తుతున్న ఇబ్బందులు, లోపాలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కి ఫిర్యాదులు చేశారు వినియోగదారులు.. అన్ని టెలికం సంస్థలపై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందినా.. ఎయిర్‌టెల్‌పై అత్యధిక ఫిర్యాదులు అందాయి.. ఈ విషయాన్ని మంత్రి దేవుసింహ్ చౌహాన్ లోక్‌సభలో వెల్లడించారు.. ఈ ఏడాదిలో నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లపై దేశవ్యాప్తంగా ట్రాయ్‌కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని.. అందులో…
పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీ ఎంపీలు పలు ప్రశ్నలు వేసి కేంద్ర మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు. తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ కులఆధారిత గణన పై జీరో అవర్ లో ప్రస్తావించారు. పదిశాతం జనాభా చేతిలో 80 శాతం సంపద ఉంది. అన్ని కులాలను కలుపుకుని పోవాలి. “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” సాధ్యం కావాలంటే కుల ఆధారిత గణన జరగాలి. కుల ఆధారిత గణన జరపాలని…
శీతాకాల పార్లమెంటు సమావేశాలు గత నెల 29 ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. అయితే లోక్‌సభ 6వ రోజు సమావేశాలు ప్రారంభం నుంచే విపక్షాలు నాగాలాండ్ ఘటనపై చర్చించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో మరోసారి లోకసభ వేడెక్కింది. విపక్షాల నినాదాలకు స్పందిస్తూ నాగాలాండ్ ఘటనపై హోంమత్రి ప్రకటన చేస్తారని కేంద్రం వెల్లడించింది. నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 17 చేరింది. ఇదిలా ఉంటే…