శుక్రవారం ముగిసిన శీతాకాల సమావేశాల్లో తొమ్మిది బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. డిసెంబర్ 7న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన 13 సమావేశాల్లో తొమ్మిది బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Parliament Winter Session : నిర్ణీత షెడ్యూలు కంటే వారం ముందే పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది.
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Kapu Reservations: ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని, ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని…
అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం(మిల్లెట్ ఇయర్) 2023ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఏర్పాటు చేసిన లంచ్‌లో తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆనందించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
Worker Can Not Take Up Moonlighting As Per Rule says Labour Minister In Parliament: ఈ మధ్య ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘‘మూన్‌లైటింగ్’’. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరో కంపెనీకి కూడా పనిచేయడాన్ని మూన్‌లైటింగ్ గా పేర్కొంటారు. ఇటీవల దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మూన్‌లైటింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఒకేసారి 300 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఒక్కసారిగా ఐటీ రంగంలో ఉద్యోగులు షాక్…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా విశాఖలో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు విశాఖలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. దేశవ్యాప్తంగా 8 బయో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కీలక పదవి వరించింది.. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా మరోసారి ఎన్నికయ్యారు సాయిరెడ్డి.. వరుసగా రెండోసారి పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు విజయసాయిరెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ ఖాతాలను పరిశీలించడం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పని.. ఇక, సాయిరెడ్డిని మరోసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా నియమించినట్టు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేశారు. మరోవైపు.. తన నియామకంపై ఆనందం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి……
పొగరాయుళ్లు ఎక్కడ పడితే అక్కడ.. అలా ఓ సిగరేట్ తీసుకుని.. స్టైల్‌గా దమ్ముకొడుతున్నారా? ఇక, మీకు షాక్ తప్పదు.. ఎందుకంటే, సిగరెట్లు లూజ్ సేలింగ్ బ్యాన్ చేసే విధంగా కేంద్రం సిద్ధం అవుతోంది.. కొన్ని నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు సమాచారం.. లూజ్ సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యుల వాదనగా ఉంది..…