President Of India: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో ద్రౌపది ముర్ముతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర ఎంపీలు హాజరయ్యారు. ప్రతిభా పాటిల్ తర్వాత భారత రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము రెండో మహిళ కావడం విశేషం. అంతేకాకుండా భారత రాష్ట్రపతి అయిన అత్యంత పిన్న వయస్కురాలుగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు.
కాగా భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె సొంత రాష్ట్రం ఒడిశాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ సత్యనారాయణ ద్రౌపది ముర్ముకు తన కళతో వినూత్నంగా కంగ్రాట్స్ తెలియజేశాడు. ఇసుకతో ద్రౌపది ముర్ము చిత్రాన్ని రూపొందించి.. ‘కంగ్రాట్యులేషన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని రాశాడు.