Telugu Desam Party MP Ram Mohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నికలు జరగడంతో పార్లమెంట్ హాలు సందడిగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ క్రికెటర్లలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీసుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల రాజ్యసభకు పంజాబ్ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అటు ఇప్పటికే బీజేపీ తరఫున ఢిల్లీ ఎంపీగా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నారు. వీళ్లిద్దరితో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫోటో తీసుకున్నారు.
Read Also: Minister Chelluboina Venu Gopala Krishna: వరదలపై చంద్రబాబు వ్యాఖ్యలు మిలీనియం జోక్..!
సోమవారం నాడు రాజ్యసభ ఎంపీగా హర్భజన్ సింగ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య కూర్చుని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫోటో దిగారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకు ఇరువైపులా కూర్చున్న ఇద్దరు మాజీ క్రికెటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతం గంభీర్ ఇప్పటికే పొలిటికల్ కెరీర్ ప్రారంభించగా… హర్భజన్ సింగ్ ఇప్పుడే రాజకీయ జీవితం ప్రారంభించారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పార్లమెంటు అనేది దేశ సమ్మిళిత సమూహానికి ప్రతీక అని.. ఇక్కడ అన్ని ప్రాంతాలు, మతాలు, వర్గాలకు చెందిన వారు ఉంటారని టీడీపీ ఎంపీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Sitting between sporting greats who've repeatedly made India proud. One has already begun an innings in public life. The other is making his debut today. All the best paaji! Parliament is a true melting pot of India, w/ persons from diverse backgrounds, regions & perspectives. pic.twitter.com/YVgstkr8Xu
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) July 18, 2022