Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం అయ్యారు. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. CRDA కార్యాలయం అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంది.
Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్‌లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కి సమాధానం ఇచ్చింది. అయితే, దీనిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్‌ని ప్రభుత్వ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
Engineer Rashid: ఉగ్రవాద నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణల కారణంగా రషీద్ 2019 నుంచి జైలులో ఉన్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన రషీద్, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఎంపీగా అతడి హోదా అతడి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదని ఎన్ఐఏ…
S Jaishankar: లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు, జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారం సభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది.
Rahul Gandhi: సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీకి, అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ స్వీకారోత్సవానికి ఆహ్వానంపై ఆయన ఆరోపణలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది.
Halwa Ceremony: కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి.
నేడు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, రాజ్యాంగ ప్రయాణంపై చర్చ జరిగింది. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాల అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం రాజ్యాంగం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజ్యాంగాన్ని లాక్కున్నారన్నారు. దేశాన్ని జైలుగా మార్చి పౌరుల హక్కులను కాలరాశారన్నారు.
లోక్‌సభలో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సభ్యులు ఘనస్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో ప్రధానికి స్వాగతం పలికారు. రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో మోడీ ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన గణతంత్ర దేశం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దాని సంస్కృతిలో భాగమన్నారు.