దేశంలో భయానక వాతావరణం నెలకొందని రాహుల్ గాంధీ అన్నారు. మహాభారతం ద్వారా రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు. చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని.. కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
ఆమె రాజ్యసభకు ఇటీవల రాజ్యసభలో అడుగు పెట్టారు. ఇది ఆమె మొదటి ప్రసంగం.. తొలిసారి మాట్లాడేందుకు తడబడ్డారు.. రాజ్యసభ విధానం తెలియకున్నా.. తాను చెప్పాల్సిన అంశాలను క్లుప్తంగా వివరించారు.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపీల చేత ప్రమాణం చేయించనున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఇతర చట్టసభ సభ్యలకు స్పూర్తిగా కొనియాడారు. ఈ రోజు రాజ్యసభలో పదవీవిరమణ చేస్తున్న సభ్యులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. సభలో వీల్‌చైర్‌లో వచ్చి మన్మోహన్ సింగ్ ఓటేసిన విషయానని పీఎం మోడీ గుర్తు చేశారు. చట్టసభ సభ్యులు తన విధుల పట్ల బాధ్యతతో ఉండటానికి ఇదో ఉదాహరణ అని అన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారని అన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, నిర్ణయాలను చెప్పారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట లేదని, అన్ని రంగాల్లో మోడి ప్రభుత్వం అద్భుతమయిన అభివృద్ధి సాధించిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ప్రసంగంలో రాజకీయ అంశాలు లేకుండా, అభివృద్ధి పైనే మాట్లాడారని, వివిధ శాఖలు…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమావేశంలో చర్చలు చాలా సహృదయపూర్వకంగా జరిగాయన్నారు. ఈ స్వల్పకాలిక సమావేశంలో ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
BJP MP Dr K Laxman Spoke on Sabarimala Ayyappa Devotees on Rajya Sabha: శబరిమల అయ్యప్ప భక్తుల కష్టాలపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడారు. ప్రతి ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శనానికి కేరళ వెళుతుంటారని.. అక్కడి ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించకుండా ఉదాసీనత చూపిస్తోందన్నారు. 20 గంటలుగా క్యూలైన్లలో భక్తులు ఇబ్బందిపడుతున్నా, తొక్కిసలాట జరుగుతున్నా.. కేరళ ప్రభుత్వానికి…
ఇవాళ పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖపై ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ సంప్రదాయాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.