కాంగ్రెస్..కిసాన్ కాంగ్రెస్ కలిసి కార్యాచరణ చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 5న సివిల్ సప్లయ్ మంత్రిని కలుస్తామని, వరి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరుతామని ఆయన వెల్లడించారు. 6న మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. శాసన సభలో రైతుల అంశాన్ని… షార్ట్ డిస్కషన్ కోసం ప్రయత్నం చేస్తామని, గవర్నర్ ని కలిసి వడ్ల…
నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న సమయంలో ఖాళీలు భర్త చేయకపోవడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షల పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీలు మంగళవారం డిమాండ్ చేశారు. జీరో అవర్ ప్రస్తావన ద్వారా సమస్యను లేవనెత్తిన ఎంపీ విజయసాయి రెడ్డి, నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ రంగం ఖాళీలతో నిండిపోతోందని అన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, సాయుధ దళాలలో లక్ష, రైల్వేలో రెండు లక్షలతో సహా కేంద్ర ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది లక్షల…
1) రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు.. నేడు రాజ్యసభ ప్రతిపక్షనేతల సమావేశం.. ఎంపీల సస్పెన్షన్‌పై తదుపరి కార్యాచరణ2) హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, రక్తదానం చేసినవారికి నేడు ఉచితంగా తిరుగుప్రయాణ బస్సు సర్వీసు3) టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం… ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ4) తిరుపతి: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, సొసైటీ ఉద్యోగులకు టీటీడీ కార్పొరేషన్ ప్రక్రియను నిలిపివేయాలని నేడు మహాధర్నా5) తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణం6) నేడు…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభ అట్టుడికిపోయింది. వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా… వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే సభలో విపక్షాల ఎంపీలు నిరసనలు తెలుపుతుండగానే సాగుచట్టాల రద్దు బిల్లును కేంద్రమంత్రి తోమర్ ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ వినతిని తోసిపుచ్చిన లోక్‌సభ…
1) నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం… వచ్చేనెల 23 వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు.. సాగుచట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభ ఆమోదం తర్వాత ఈరోజే రాజ్యసభకు పంపే అవకాశం2) ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు ప్రతిపక్షాల సమావేశం.. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ కానున్న విపక్ష పార్టీలు3) ఢిల్లీ: ఈరోజు పార్లమెంట్ వరకు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ వాయిదా వేసిన సంయుక్త కిసాన్…
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రసాభాసాగా సాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నూతన వ్యవసాయ చట్టాలు, పెగాసస్ అంశంపై చర్చకు పట్టుబడుతూ వచ్చాయి విపక్షాలు. నినాదాలు, నిరసనల మధ్య సభను నిర్వహించారు. అయితే, ఈరోజు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. 17 రోజులపాటు లోక్‌సభ సమావేశాలు…
రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 14 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు హాజరయ్యారు. కేంద్రంపై ఉమ్మడిపోరును సాగించేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా పెగాసస్ స్పైవేర్ అంశంపై విపక్షాలు పట్టుబడుతున్నారు. దీంతో పాటుగా ప్రజాసమస్యలపై ఉమ్మడిగా పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాయి. బిల్లులపై సమగ్రంగా చర్చించకుండానే ఆమోదించుకోవడంపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. Read: సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసింది. తప్పనిసరిగా ఆఫీస్‌కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఒకప్పుడు ఐటి రంగానికే పరిమితమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలకు పాకింది. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. మనదేశంలో కూడా ప్రస్తుతం ఇలానే జరుగుతున్నది. మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా…