Two-Wheelers And Four-Wheelers In India: దేశంలో టూవీలర్లు, ఫోర్ వీలర్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ముక్యంగా ద్విచక్ర వాహనాలు దాదాపుగా ఒక్కో కుటుంబానికి ఒకటి ఉంటోంది. ఇదిలా ఉంటే దేశంలో మొత్తం రిజిస్టర్ అయిన టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల వివరాలను వెల్లడించారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పార్లమెంట్ సభ్యులు అడిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ వాహనాల వివరాలను వెల్లడించారు. దేశంలో ఆగస్టు 3,…
G. V. L. Narasimha Rao: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ- శ్రమ్ రిజిస్ట్రేషన్ లేబర్ కార్డులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన కానుక అని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. ఈ- శ్రమ్ రిజస్ట్రేషన్ పథకంపై ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి రామేశ్వర్ సమాధానం ఇచ్చారు. ఈ - శ్రమ్ కార్డుదారులు భవిష్యత్తులో సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా పొందుతారని…
Revokes Suspension of Congress MPs: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెన్షన్ కు గురైన నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సభా వ్యవహారాలకు అడ్డుతగిలే విధంగా.. కాంగ్రెస్ ఎంపీలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్భనంపై నిరసన తెలిపారు. దీంతో ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సెషన్ మొత్తం ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి,…
వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
భారతదేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. భారతదేశంలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఐదు కోట్ల మార్కుకు చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వెల్లడించారు.
Women's Panel Issues Notice To Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేద్ధాం అని చూసిన కాంగ్రెస్ పార్టీ.. అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఢిపెన్స్ లో పడింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ముర్మును ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించడంతో…
పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీల అనుచిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
కేంద్రం 2017 నుంచి ప్రకటనల కోసం రూ. 3,339 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ రాజ్యసభలో వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.