మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన మధ్య, ప్రతిపక్షాలు బుధవారం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
మహిళలపై జరుగుతున్న నేరాలు, మణిపూర్‌లో జాతి హింసపై కేంద్రం, ప్రతిపక్షాలు మరోసారి గొంతు చించుకున్నాయి. మణిపూర్‌లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల ఆరోపణలపై అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు వరుసగా మూడు రోజుల పాటు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ గట్టిగా వాయిదా నోటీసులు సమర్పించారు.
ఆర్మీలో 6,800కు పైగా ఖాళీలతో కూడిన మేజర్, కెప్టెన్ స్థాయిలలో అధికారుల కొరత ఉందని, అయితే ప్రస్తుత కార్యాచరణ అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉన్న బలం సరిపోతుందని కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలియజేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయసభలు మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో రెండు సభలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
Uniform Civil Code: కేంద్రం ఈ పార్లమెంటరీ సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లు ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ ఈరోజు సమావేశం కానుంది.
Uniform civil code: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ (యూసీసీ)పై భోపాల్ లో ఓ సభలో కామెంట్స్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి దీనిపై ప్రధానంగా వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూసీసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఆగస్టు 12న సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే ఈ రోజే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలను పంచుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యసభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు.