Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 3 More Mps Suspended From Rajya Sabha For This Week

Parliament Monsoon Session: రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు

NTV Telugu Twitter
Published Date :July 28, 2022 , 3:52 pm
By Mahesh Jakki
Parliament Monsoon Session: రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Parliament Monsoon Session: రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్, స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ ఉన్నారు. గురువారం రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారనే ఆరోపణలపై ఈ వారం మిగిలిన కాలానికి రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు 23 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు.

సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించినందుకు మంగళవారం మొత్తం 19 మంది ప్రతిపక్ష ఎంపీలను ఈ వారం మిగిలిన వారం పాటు ఎగువ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎగువ సభలో ఒకే బ్యాచ్ సస్పెన్షన్‌లలో ఇదే అత్యధికం. గత ఏడాది నవంబర్‌లో వ్యవసాయ బిల్లులపై వర్షాకాల సమావేశాల సందర్భంగా వారు సృష్టించిన గందరగోళానికి 12 మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశమంతా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన 19 మంది సభ్యుల్లో ఏడుగురు టీఎంసీకి చెందినవారు, ఆరుగురు ఎంపీలు డీఎంకే, ముగ్గురు టీఆర్‌ఎస్, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐకి చెందినవారు. సస్పెండ్ అయిన ఆ 19 మంది సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్‌రావులతో పాటు సుస్మితా దేవ్, శాంతను సేన్, డోలా సేన్, కనిమొళి, మౌసుమ్‌ నూర్, శాంతా ఛెత్రీ, నదీముల్‌, రహీమ్‌, గిరిరాజన్‌, అభిరంజన్ బిస్వార్, అహ్మద్ అబ్దుల్లా, రహీం, కల్యాణసుందరం, ఎన్.ఆర్.ఇలాంగో, శివదాసన్, సందోష్ కుమార్ ఉన్నారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇప్పటివరకు 23 మంది రాజ్యసభ ఎంపీలు, 4 లోక్‌సభ ఎంపీలతో సహా మొత్తం 27 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.

Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం

లోక్‌సభలో సోమవారం నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు. మాణిక్కం ఠాగూర్ సహా నలుగురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో మాణిక్కం ఠాగూర్, టీఎన్‌ ప్రతాపన్‌, జ్యోతిమణి, రమ్య హరిదాస్‌లు ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • Monsoon Session
  • MPs suspended from Rajya Sabha
  • Parliament Monsoon session
  • Parliament session

తాజావార్తలు

  • Pawan Kalyan’s OG : ఓజీ సినిమాకి కొత్త తలనొప్పి?

  • CM Chandrababu: కడప తెలుగుదేశం పార్టీ అడ్డా.. వారికి ప్రజలే బుద్ధి చెప్పారు..

  • Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల

  • DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..

  • Shashi Tharoor: ప్రధాని మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రం..

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions