Adhir Ranjan Chowdhury: పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ పట్ల బీజేపీ ఎంపీల అనుచిత ప్రవర్తనను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. లోక్‌సభలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీపై అధికార పార్టీ ఎంపీలు దురుసుగా వ్యవహరించారని మండిపడ్డారు. మధ్యాహ్నం సభ వాయిదా పడ్డ తర్వాత సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని వెల్లడించారు. ఎందుకు నిరసన తెలుపుతున్నారంటూ బీజేపీ సభ్యురాలు రమాదేవితో సోనియా మాట్లాడుతుండగా, కొందరు కేంద్రమంత్రులు సహా బీజేపీ ఎంపీలు ఆమెను చుట్టుముట్టి మాటలదాడి చేశారని, భయపెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ ఆయన ఆరోపించారు.
దాంతో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు, ఇతర విపక్ష సభ్యులు వచ్చి సోనియాను అక్కడ్నించి క్షేమంగా ఇవతలికి తీసుకువచ్చారని వివరించారు. లేకపోతే సోనియా గాయపడి ఉండేవారని అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలన్నారు. దురుసుగా ప్రవర్తించిన సభ్యులను సస్పెన్షన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
Chess Olympiad: చెస్ ఒలింపియాడ్ షురూ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా పోటీలు ప్రారంభం
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ‘రాష్ట్రపత్ని’ అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు పార్లమెంట్‌లో నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా వీడియోను విడుదల చేశారు. తాను క్షమాపణ చెబుతానని.. తనను ఉరితీసినా తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని.. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.