Rashtrapatni Comments: ద్రవ్యోల్భనం, ఈడీ కేసులు, నిరుద్యోగం, జీఎస్టీ తదితర అంశాలపై కాంగ్రెస్ పోరాడుతోంది. అధికార పార్టీ బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని రేపాయి. అధీర్ రంజన్ చౌదరి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ..‘‘ రాష్ట్రపత్ని’’ అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును…
Central Government Jobs in 8 years: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గడిచిన 8 ఏళ్లలో 7.22 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వెల్లడించారు. 2014-2022 మధ్య ఈ రిక్రూట్మెంట్ జరిగినట్లు బుధవారం పార్లమెంట్ లో…
RS MPs Protest..Slogans against Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబడుతున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బనం, ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు
భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంపై ఎలాంటి ప్రతిపాదన లేదని కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక ధరలపై సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా సాగేలా సహకరించాలంటూ కోరారు. కానీ ఆందోళనను విరమించకపోవడంతో... నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలరు అంతరాయం కలిగిస్తున్నారంటూ విపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు.
Central Govt key announcement in Parliament on Jamili election: కేంద్రం జమిలి ఎన్నిలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. అలాగే అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించామని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2021, మార్చి 1 నాటికి అన్ని శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య మొత్తం 40.35లక్షలు కాగా.. వాటిలో దాదాపు పది లక్షలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.