Vinesh Phogat: ఒలింపిక్స్లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని యావత్ దేశం వినేష్ ఫోగట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా ఒలింపిక్స్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం ఒక్కసారిగా దేశం షాక్‌కి గురైంది.
పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు చేదువార్త వచ్చింది. 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా ప్రకటించారు. దీనిపై భారత రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ స్పందించారు.
ఒలింపిక్స్లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయాన్ని చవిచూసింది. సెమీ-ఫైనల్‌లో గెలిచిన తర్వాత ఆమె ఫైనల్ మ్యాచ్‌లోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ ఆమె బరువు నిర్దేశించిన నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నందున ఆమె అనర్హత వేటుపడింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించగా, మూడింటికి కాంస్యం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మను, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాలను సాధించారు. కాగా.. రెండు పతకాలు సాధించిన మను భాకర్ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సత్కరించారు.…
Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నీరులా క్రీడాకారులకు, ఇతరులకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో మంగళవారం జర్మనీతో తలపడనుంది. కాగా.. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు జర్మనీని ఓడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని భారత జట్టు చూస్తుంది.
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ కు చెందిన ప్రొవోకేషన్‌ను 7–5తో ఓడించింది. దీంతో.. సెమీస్ లోకి ప్రవేశించింది. కాగా.. ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Paris Olympics 2024 Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. గ్రూప్ Bలో ఉన్న నీరజ్ 89.34 మీటర్ల దూరం విసరడంతో ఫైనల్ లోకి ప్రవేశించాడు. ఈ ఈవెంట్‌లో 84 మీటర్ల మార్కు నేరుగా ఫైనల్ కు అర్హత సాధించేలా సెట్ చేయబడింది. కాగా, భారత్‌కు చెందిన మరో త్రోయర్ కిషోర్ జెనా 80.73 మీటర్ల బెస్ట్ ఎఫర్ట్…
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రీక్వార్టర్స్ లో 50 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో తలపడి 3-2 తేడాతో విజయం సాధించింది.
Ukrainian high jumper Yaroslava Mahuchikh takes a nap before competition: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఉక్రెయిన్ మహిళా హై జంపర్ యారోస్లావా మహుచిఖ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మహిళల హై జంప్ ఫైనల్స్‌లో 2.10 మీటర్లను క్లియర్ చేసి గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన నికోలా ఒలిస్లేగర్స్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. ఆస్ట్రేలియాకే చెందిన ఎలినల్ పాటర్‌స్ కాంస్య పతకం గెలుచుకుంది. యారోస్లావా మహుచిఖ్ ఫైనల్ పోటీకి…