పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు వేటుకు గురైన భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభకు పంపాలని డిమాండ్ పెరిగింది. ఆమె వేటుకు గురైనప్పుడు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది.
100 గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేశ్ అర్హురాలేనని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభిప్రాయపడింది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. సెహ్రావత్ 12-0తో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై విజయం సాధించాడు.
ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
వివాదాస్పద సంఘటన తర్వాత రెజ్లర్ అంతిమ్ పంఘల్ ఓ వీడియోను విడుదల చేసింది. తన అక్రిడిటేషన్ రద్దు గురించి మాట్లాడుతూ.. తన సోదరిని ఒలింపిక్ క్యాంపస్లోకి ప్రవేశించడానికి తన అక్రిడిటేషన్‌ను ఉపయోగించినట్లు చెప్పింది. కాగా.. మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల తొలి రౌండ్‌లో అంతిమ్ పంఘల్ తొలి మ్యాచ్ లో 0-10తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని అంతిమ్ పంఘల్ చెప్పింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఈరోజు (13వ రోజు) భారత్‌కు ప్రత్యేకమైనది. కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు నేడు స్పెయిన్‌తో తలపడనుంది. వాల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన పీఆర్ శ్రీజేష్ తన చివరి మ్యాచ్లోనూ పతకం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లింగ్‌కు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. వినేష్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రిడిటేషన్ రద్దు చేయబడింది.
Mahesh Babu Supports Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. స్వర్ణ పతకం సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. కానీ ఫైనల్ ముందు ఆమెపై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్.. 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు గుర్తించి అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన…
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు అనర్హులుగా ప్రకటించబడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.