పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించగా, మూడింటికి కాంస్యం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మను, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాలను సాధించారు. కాగా.. రెండు పతకాలు సాధించిన మను భాకర్ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సత్కరించారు. మంగళవారం పారిస్‌లోని ఇండియన్ హౌస్‌లో ఆమె మనును సన్మానించారు.
AP Crime: దారుణం.. యువకుడికి మద్యం తాగించి చిత్ర హింసలు..!
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. గతవారం పారిస్‌లో హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించి తన కలలు, అభిరుచి, శ్రమ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిందని తెలిపారు. మను విజయాల ద్వారా ప్రతి భారతీయుడు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఈ విజయాల ద్వారా శక్తిని పొందినట్లు అనిపిస్తుందని చెప్పారు.
Muhammad Yunus: ఆర్మీ పాలనకు నో.. యూనస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం..
మూడేళ్ల తర్వాత క్రీడల్లో తన భవితవ్యాన్నే కాకుండా దేశ భవితవ్యాన్నే మార్చేసిందని మను భాకర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. మరోవైపు.. పారిస్ ఒలింపిక్స్లో స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయిన ప్రతి క్రీడాకారులను నీతా సత్కరించింది. వారిలో లోవ్లినా బోర్గోహైన్, నిశాంత్ దేవ్ కూడా ఉన్నారు. లోవ్లినా, నిశాంత్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే..