TSPSC Paper Leakage Case: పేపర్ లీకేజ్ కేసు.. ఆ ముగ్గురి ఇళ్లల్లో సిట్ సోదాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leakage Case: TSPSC పేపర్ లీకేజ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. పేపర్ లీకేజ్ పై రాజకీయం దుమారం అందుకుంది. నిరనలు, దీక్షల వరకు దారితీస్తున్నాయి. పేపర్ లీకేజ్ విషయంలో ఒకరిపై ఒకరు మాటల యుద్దం కొనసాగుతుంది. పేపర్ లీకేజ్ కి కారణం నువ్వుంటే నువ్వు అని ఒకరిపై మరొకరు దుమారం రేపుతున్నారు. టీఎస్‌పీఎస్ పేపర్ లీకేజ్ కేసులో నిందులను అదుపులో తీసుకున్న సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కొందరికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు పలువురు నిందితులను అదుపులో తీసుకున్న సిట్ ఇవాళ షమీమ్, సురేష్, రమేష్ లను రెండో రోజు విచారించున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన షమీమ్ తన వద్ద నుంచి ప్రశ్నాపత్రాన్ని ఇంకా ఎవరికైనా షేర్ చేసిందా అనే దానిపై సిట్ ఆరా తీస్తుంది. వీరి ముగ్గురి సెల్ ఫోన్ డేటా ను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ , రాజశేఖర్ ల నుండి షమీమ్ ప్రశ్నాపత్రం పొందింది. ఇవాల సిట్ బృందం ముగ్గురు నిందితుల ఇళ్ళల్లో సోదాలు చేయనున్నారు.
Read also: Ambati Rambabu: చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ పుట్టాడు.. ఆయన్ని దేవుడే రక్షించాలి..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
TSPSC గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను సిట్ కస్టడీకి తీసుకొని తొలిరోజు వారిలింక్‌లపై ఆరా తీసింది. ఇక ప్రధాన నిందితుడు ప్రవీణ్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి, టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న రమేశ్, షమీమ్‌తోపాటు మాజీ ఉద్యోగి సురేశ్‌కు అందించారు. ఈనేపథ్యంలో.. రమేశ్, షమీమ్‌తోపాటు సురేశ్‌ను మరో నాలుగురోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో కమిషన్‌లో పనిచేస్తున్న మొత్తం 26 మంది ఉద్యోగులు గ్రూప్-1 పరీక్ష రాయగా.. మిగతా ఉద్యోగులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే.. గ్రూప్-1లో 100 మార్కులు దాటిన సుమారు వంద మంది విచారణను సిట్ పూర్తి చేసింది. ఇక, రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉండటంతో అతనికి కూడా ప్రశ్నపత్రం పంపించి, పరీక్ష రాయించారు. కాగా.. ఇందులో ప్రశాంత్ తప్ప అందరిని సిట్ అరెస్ట్ చేయగా.. అక్టోబర్ మొదటి వారంలో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి పేపర్ లీక్ చేశారు. దీంతో.. ఆ విషయం తెలుసుకొన్న రమేశ్, షమీమ్, సురేశ్ వారిని బ్లాక్‌మెయిల్ చేసి పేపర్‌ను తీసుకున్నట్టు అనుమానాలు రావడంతో ఆ దిశగా విచారిస్తున్నారు. వీరందరూ.. స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగానే గ్రూప్-1 పేపర్‌ను లీక్ చేసి.. ఆ నలుగురికి అందించినట్టు ప్రధాన నిందితులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.. బ్లాక్‌మెయిల్ చేసింది ఈ ముగ్గురా? ఇతరులెవరైనా ఉన్నారా? అనే విషయాలను సిట్ పరిశీలిన కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కస్టడీలో ఉన్న నిందితుల కాల్‌డాటాను విశ్లేషించి..ఈ ముగ్గురికి పేపర్ వచ్చిన తరువాత ఎవరెవరు కలిశారు? అందులో పరీక్ష రాసిన వారెవరు? వారికొచ్చిన మార్కులు ఎన్ని అనే అంశాలను శాస్త్రీయంగా సేకరిస్తున్నారు. నిన్న (బుధవారం) ముగ్గురిని వేర్వేరుగా విచారించి.. సాధారణ విషయాలను రాబట్టారు. ఇవాల రెండోరోజు శాస్త్రీయంగా సేకరించిన ఆధారాలను వారి ముందు ఉంచి ఆయా అంశాలను నిర్ధారించనున్నారు సిట్ అధికారులు.
Clash: రామాలయం బయట యువకుల మధ్య హింసాత్మక ఘర్షణ.. పోలీసు వాహనాలకు నిప్పు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!