పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు.
CM Revanth Reddy : నారాయణపేట “ప్రజా పాలన- ప్రగతి బాట”బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని, పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి…
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేడు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించిన సీఎం, అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ఎంపీ డీకే…
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే…
పాలమూరు రంగారెడ్డ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల్లోపు ఉదండాపూర్, బీమా, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో గత ప్రభుత్వం 22,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరందించలేదని, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి…