పాలమూరు రంగారెడ్డ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల్లోపు ఉదండాపూర్, బీమా, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో గత ప్రభుత్వం 22,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరందించలేదని, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి…