Pakistan: సాక్ష్యాత్తు అమెరికా అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ దేశ విదేశాంగ శాఖ, పెంటగాన్ పాకిస్తాన్‌తో అటంకాగుతోందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (మాజీ) హెచ్ఆర్ మెక్‌మాస్టర్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్‌కి సహాయం ఆపేయాలని ఆయన చెప్పినప్పటికీ విదేశాంగ శాఖ,
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా.. దీనిపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Shaheen Afridi: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కెప్టెన్ షాన్ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడంతో పాటు డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బ తీసినందుకే అతడిని టీమ్ నుంచి తప్పించారనే ప్రచారం వస్తుంది.
Pakistan: పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు కాశ్మీర్‌ని సాధనంగా వాడుకుంటోంది. అ దేశంలో ప్రజలు తినడానికి తిండి లేకున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కాశ్మీర్ తమ ప్రాధాన్యత ఎజెండాగా ఉంచుతోంది.
Pakistan: పాకిస్థాన్ దేశంలో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధ బలగాలు మారణకాండ సృష్టించాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు, రైల్వే ట్రాకులు, వాహనాలపై కాల్పులకు పాల్పడి దాదాపు 70 మందిని హత మార్చాయి.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అతి విశ్వాసంతో తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసిన పాక్.. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. పాక్ ఓటమిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ఆటగాళ్ల కంటే క్లబ్ క్రికెటర్లే మెరుగ్గా ఆడతారని ఎద్దేవా చేశారు. చెత్తగా ఓడి కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుతూ ఎలా ఉండగలిగారో తనకు అర్థం కావడం…
Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో బహిరంగంగానే మృత్యువు ఆట ఆడింది. కొంతమంది సాయుధ వ్యక్తులు ట్రక్కులు మరియు బస్సుల నుండి ప్రయాణీకులను తీసివేసి, వారిని గుర్తించిన తర్వాత, వారిపై కాల్పులు జరిపారు.
బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఇరు టీంల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఆగస్టు 21- 25 మధ్య రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.
PAK vs BAN: రెండు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా సాధించింది. టెస్ట్ ఫార్మాట్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇకపోతే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తన…
PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం.