Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే, వారు దేశాన్ని విభజిస్తారు. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్కి తెలుసు’’ అని అన్నారు.
Indian Navy: బంగ్లాదేశ్ సంక్షోభం, ఈ ప్రాంతంలో అస్థిరత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి భారత నావికాదళం టాప్ కమాండర్లు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Petrol Tanker: శనివారం హైతీలో గ్యాసోలిన్తో వెళ్తున్న ట్యాంకర్ ట్రక్కు బోల్తాపడి పేలి 15 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి వ్యాఖ్యానించడానికి హైతీ అధికారులు సుముఖత చూపించలేదు. హైతీలోని ఆసుపత్రుల్లో తీవ్రంగా కాలిన రోగులకు చికిత్స చేయడానికి తగిన సౌకర్యాలు లేవు. ఈ ఘటన బలూచిస్థాన్ లోని జోబ్ జిల్లాలోని ధన సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కోట్ల జనాభా ఉన్న ఈ దేశం కూడా ఇంధన కొరతతో సతమతమవుతోంది. ముఠాల…
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ విక్టరీ సాధించింది. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన భారత్.. నామమాత్రపు మ్యాచ్‌లో పాకిస్తాన్ ను ఓడించింది. 2-1 ఆధిక్యంతో గెలుపొందింది.
Pakistan: పాకిస్తాన్ పరిపాలన సైన్యం చేతుల్లో ఉందో, లేక ఎన్నికైన ప్రభుత్వం చేతుల్లో ఉందా? అనేది ఎవరికి తెలియదు. నిజానికి బయటకు ప్రజాప్రభుత్వం కనిపిస్తున్నా, అంతా వెనకనుంచి నడిపించేది ఆ దేశ సైన్యమే. ఆ దేశ సైన్యాన్ని కాదని ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే, పాక్ ఆర్మీ అంతర్గత భద్రతను పర్యవేక్షించే పోలీసులు విధుల్లో్ కూడా జోక్యం చేసుకుంటోంది. ఆ దేశంలో సైన్యం వర్సెస్ పోలీసులుగా వ్యవహారం మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తుల్లో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త కూడా ఉన్నాడు. ఇతను అమెరికా ప్రభుత్వం తరుపున సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా వ్యవహరాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే, ఇతడిని కలిస్తే సమస్య ఏంటని చాలా మంది అనుకోవచ్చు కానీ, ఇతను వెళ్లిన ప్రతీచోట ప్రభుత్వాలు దిగిపోవడం, తిరుగుబాటు రావడం జరిగింది.
పాకిస్థాన్‌ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake: ఢిల్లీ-ఎన్సీఆర్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తుంక్వా నుండి పంజాబ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అంశం వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. కొన్ని వీడియోలు చూస్తే.. వాస్తవమా ? కాదా అనేది నమ్మడం కష్టంగా మారుతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది పాకిస్తాన్‌కు చెందినది అని చెబుతున్నారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి తలపై సీసీటీవీ కెమెరాను పెట్టుకుని కనిపించింది.
Kargil War: 1999లో భారత్‌పై పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల ముసుగులో కార్గిల్ యుద్ధానికి తెరలేపింది. అయితే, ఈ యుద్ధం జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడిచినా ఇందులో పాకిస్తాన్ ఆర్మీ తన ప్రేమేయం గురించి ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. ఈ యుద్ధం వెనక కర్త,కర్మ,క్రియ అంతా పాకిస్తాన్ ఆర్మీ అనేది బహిరంగ రహస్యమే అయినా, ఎప్పుడు కూడా తన పాత్రను అంగీకరించలేదు. ఇదిలా ఉంటే, తొలిసారిగా పాకిస్తాన్ ఈ యుద్ధంతో తమ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది.