హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లోని దక్షిణ నగరమైన కరాచీలో ఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది. అయితే కొద్దిసేపటికే నిరసన హింసాత్మకంగా మారింది. చాలా మంది ప్రజలు రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
Rajnath Singh: పాకిస్తాన్‌ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్‌తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Pakistan: పాకిస్తాన్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. చార్టర్డ్ విమానం ఆయిల్ కంపెనీ ఉద్యోగులను తరలిస్తుండగా, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఫెయిల్ అయింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మూవీ ఇండస్ట్రీలో బహుబలిగా చెప్పబడుతున్న ‘‘ది లెజెండ్ ఆఫ్ హౌలా జాట్’’ సినిమా భారతదేశంలో విడుదల చేసేందుకు అనుమతి రాలేదు. 2019 నుంచి పాకిస్తాన్లో భారతీయ సినిమాల విడుదలపై ఆ దేశం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో కూడా ఈ సినిమా విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం పంజాబ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
India-Pakistan: ఎన్నిసార్లు భంగపడినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. దీనికి మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చింది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మరణించారు. సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుర్రం జిల్లాలో ఇస్లాం మరియు షియా వర్గానికి చెందిన తెగల మధ్య మత ఘర్షణలు తలెత్తాయి.
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అందిన 1.25 కోట్ల సమర్పణలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కోరారు. దీని వెనక వాంటెడ్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్, పాకిస్తాన్ ఐఎస్ఐ, చైనాల పాత్ర ఉందని అతడు అనుమానించారు.
ISI: పాకిస్తాన్ గూఢచార ఎజెన్సీ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ నియమితులైనట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న మాలిక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వం కన్నా అత్యంత శక్తివంతమైన విభాగం ఆ దేశ సైన్యం. సైన్యాధ్యక్షుడి తర్వాత అంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్‌ని భావిస్తారు. ఈయన పాకిస్తాన్లో నెంబర్ 2గా ఉంటారు.
Pakistan-Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశం పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. అక్కడ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకోవాలని చెబుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగ చర్చలు జరుపుతోంది.