Pakistan : జైలు నుంచి బయటపడటానికి సైన్యంతో ఎలాంటి రాజీ పడబోనని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అలా చేయడానికి తానేం నవాజ్ షరీఫ్ ను కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన దేశం కోసం నిలబడతానని స్పష్టం చేశారు.
Boat Sink : పశ్చిమ ఆఫ్రికా నుండి స్పెయిన్ వెళ్తున్న పడవ మునిగిపోయినప్పుడు 44 మంది పాకిస్తానీ వలసదారులు సహా 50 మందికి పైగా మరణించారు. ఈ పడవ జనవరి 2న బయలుదేరి గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది.
Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా ఎప్పుడైతే పదవీ కొల్పోయిందో అప్పటి నుంచి నెమ్మదిగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ పాకిస్తాన్‌తో బంగ్లా రిలేషన్స్‌ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్‌లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్‌కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.
Rajnath Singh: పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్(పీఓకే)పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని అన్నారు.
Maha kumbh mela: ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం, హిందువుల ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళ’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదులు త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
Pakistan: ఆర్థిక సంక్షోభం, అప్పులు, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కి జాక్‌పాట్ తగిలింది. సింధునదిలో ‘‘బంగారు నిల్వలు’’ ఉన్నట్లు తేలింది. ప్రాచీన సింధు లోయ నాగరికతకు ఈ నది తల్లిగా ఉంది. అద్భుతమైన నాగరికత ఈ నదీ ఒడ్డునే వెలిసింది. మెహంజోదారో, హరప్పా వంటి గొప్ప నగరాలు ఈ నాగరికతలో వెలిశాయి. ఋగ్వేదంలో కూడా సింధు నదీ ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 3300-1300 మధ్య హరప్పా నాగరికతకు కీలకంగా సింధునది ఉంది.
Undivided India: భారత వాతావరణ శాఖ(IMD) నిర్వహించే ‘‘అన్ డివైడెడ్ ఇండియా’’ కార్యక్రమానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్ ఆహ్వానించింది. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబడుతున్న సెమినార్లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఇతర పొరుగు దేశాలను ఆహ్వానించింది.
Pakistan: పాకిస్తాన్ అత్యంత కష్టకాలంలో ఉంది. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రాజకీయ అస్థిరత. దీనికి తోడు బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాలిబన్ల ఎటాక్స్ ఇలా అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పైకి చెప్పలేకపోతోంది, కానీ పాకిస్తాన్ కొన్ని రోజుల్లో ముక్కలు అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు పాకిస్తాన్‌ని మిత్రదేశాలు కూడా పట్టించుకోవడం లేదు. చైనా, టర్కీ వంటి…
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రపంచ క్రీడ ప్రపంచంలో పాకిస్థాన్ అవమానకరంగా నిలిచే అవకాశం రాబోతుంది. పాకిస్థాన్ త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్యం కొనసాగించడం లేదా తప్పించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అయితే, ఇందుకు పాకిస్థాన్ లోని మూడు ప్రధాన క్రికెట్ స్టేడియాలు లాహోర్, రావల్పిండి, కరాచీలో ఏర్పాట్లు…