పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వచ్చిన భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు రాలేదు.
ఇది కూడా చదవండి: China: చైనాలో భీకర గాలులు.. 700 విమాన సర్వీసులు రద్దు
10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నిర్ధారించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లాలో భూకంప కేంద్రం గుర్తింపబడినట్లుగా తెలిపింది. కాశ్మీర్ వరకు ప్రకంపనలు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో రైలు వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది. అయితే హై-స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా మాత్రం కొనసాగుతున్నాయి.
ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
A magnitude 5.5 #earthquake just happened in Pakistanpic.twitter.com/eydgqc1lyC https://t.co/07zyevTzUb
— Hydrau | Earthly Insights (@Hydrau_) April 12, 2025
People on the street after 5.8 earthquake that was felt in Islamabad, Pakistan pic.twitter.com/8syXHLx2I9
— Disasters Daily (@DisastersAndI) April 12, 2025
An earthquake of magnitude 5.8 on the Richter scale hit Pakistan at 1:00 PM (IST): National Center for Seismology pic.twitter.com/J4X2P28f9I
— ANI (@ANI) April 12, 2025