Pulwama Attack: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ‘‘పుల్వామ ఉగ్రదాడి’’కి ఆరేళ్లు గడిచాయి. 2019, ఫిబ్రవరి 14న పేలుడు పదార్థాలతో నిండిన కారు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడింది.
World's Most Corrupt Country: 2024లో ప్రపంచంలో అత్యంత అవినీతి సూచిక(సీపీఐ) ప్రకారం.. డెన్మార్క్ ప్రపంచంలో అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా తొలిస్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Rachin Ravindra: ఈ ఏడాది పాకిస్తాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025ను ఆతిథ్యం ఇవ్వబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఆ దేశం ప్రతిపాదనలు, తయారీలు వివాదాస్పదంగా మారాయి. 24 సంవత్సరాల తరువాత పాకిస్తాన్లో ఐసీసీ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టినప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇంకా సిద్ధతలకు సంబంధించి కొన్ని లోపాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్ లో ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీరిస్ తొలి…
ఓ అమెరికన్ మహిళ తన ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ చేరుకుంది. ఆమె నెలల తరబడి పాకిస్థాన్‌లో ఉండింది. ప్రభుత్వం, ప్రేమికుడి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసింది. ఈ ఘటనలో ప్రత్యేకత ఏమిటంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆమె తన 19 సంవత్సరాల ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకుంది. పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఆ మహిళ పేరు ఒనిజా ఆండ్రూ రాబిన్సన్. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. వీరిద్దరూ ఆన్లైన్లో…
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారు. యూనస్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని, అరాచకవాదుల్ని విడుదల చేసింది.
రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు ఎవరనే దానిపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్, ఆస్ట్రేలియా అడుగు పెడతాయని చెప్పుకొచ్చాడు. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే చెరో రెండు సార్లు ఈ ట్రోఫీని దక్కించుకున్నాయని రిక్కీ పాటింగ్ అన్నారు.
Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఘర్షణతో అట్టుడికిపోతోంది. గత 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిణామాలను సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బలూచిస్తాన్ వెళ్లారు.
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు, సైన్యానికి జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 31-ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్భందించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్వం సిద్ధం చేస్తోంది. ట్రోఫీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న పీసీబీకి మరో తలనొప్పి వచ్చింది. పాకిస్థాన్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పేరును గడాఫీ స్టేడియం నుంచి తొలగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ వార్తలపై పీసీబీ వర్గాలు స్పందించాయి. ఎవరి పేర్లను తొలగించడం గాని, మార్చడం…
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు…