Vasi Zakariya: పాకిస్థాన్ దేశంలోని ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ వాసి జకర్యను పోలీసులు మద్రాసు ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చిన జకర్య తొలుత ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని జాన్‌పీరీలు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వరంగల్ జిల్లాలో స్థిరపడిన జకర్య, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఒక బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తూ జీవనం…
PAK vs WI: ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్‌పై 120 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో కేవలం సిరీస్‌ను గెలుచుకోవడమే కాదు. 35 ఏళ్ల తర్వాత ముల్తాన్‌లో సుల్తాన్ గా పేరొందిన పాకిస్తాన్ జట్టుకు సొంత గడ్డపై వెస్టిండీస్ జట్టు చుక్కలు చూపించింది. 1990 తర్వాత పాక్ గడ్డపై వెస్టిండీస్ గెలిచిన ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన…
Pakistan-Bangladesh: షేక్ హసీనా దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య స్నేహం బలోపేతం అవుతోంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారం బలపడుతోంది. ఇటీవల కాలంలో పలువురు బంగ్లాదేశ్‌కి చెందిన పలువురు సైనికాధికారులు పాకిస్తాన్ వెళ్లి వచ్చారు.
Tahawwur Rana: అమెరికా సుప్రీం కోర్టు శనివారం 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు పంపించేందుకు ఆమోదం తెలిపింది. 2008 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన తహవ్వూర్ రానా, పాకిస్తాన్ మూలానికి చెందిన కెనడియన్ పౌరుడిగా గుర్తించబడ్డాడు. రానా అప్పగింతను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించింది. జనవరి 21న, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, అమెరికా సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. ‘పిటీషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని కోర్టు…
షాహునగరి కొల్లాపూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్హాపూర్ కుస్తీ, బెల్లం, ఆహార సంస్కృతి, కొల్హాపురి చెప్పులు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరూ కొల్హాపురి చెప్పులు వేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఈ కొల్హాపురి చప్పల్ పాకిస్థాన్‌లోనూ క్రేజ్‌గా మారింది. ఆన్లైన్ మాధ్యమాల ద్వారా పాకిస్థాన్ నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక్కడి వ్యాపారులు పెద్ద మొత్తంలో చెప్పులను పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
Pakistani Youtuber: పాకిస్తాన్ యూట్యూబర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రో-ఇండియా కంటెంట్ చేసే ప్రముఖ యూట్యూబర్ల అయిన సనా అమ్జాద్, సోయబ్ చౌదరిలు గత 21 రోజులుగా కనిపంచలేదు. వీరిని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ కిడ్నా్ప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. వీడియోలు పోస్టు చేసేందుకు యువత అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే లైక్‌లు కోసమో తెలియదు గానీ.. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్లో తీవ్రవాదం గురించి వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదమే క్యాన్సర్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలనే తినేస్తోందని అన్నారు. ముంబైలోని 19వ నాని ఏ పాల్ఖివాలా స్మారక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత దశాబ్ధ కాలంగా భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి చెప్పారు.
హైబ్రిడ్ మోడల్లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
Imran Khan : 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.