CM Chandrababu : ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
- మహానాడులో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
- ‘భారతరత్న’పై ఏకగ్రీవ తీర్మానం
- మహిళలకు 33% రిజర్వేషన్‌పై చంద్రబాబు ప్రకటన
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద మారుమోగిన ‘సీఎం సీఎం’ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న మహానాడు ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగుజాతికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన చారిత్రాత్మక తీర్మానాన్ని మహానాడు వేదికగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదని, కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఒక సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వెండితెరపై తిరుగులేని నటుడిగా ఎదిగి, పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందని సీఎం చంద్రబాబు కొనియాడారు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ చేసిన పాలన దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచిందని, కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం కీలక పాత్ర పోషించేలా ఆయనే పునాదులు వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాల సాధనలో భాగంగానే భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసే క్రమంలో నారా లోకేష్ ప్రతిపాదించిన మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును పార్టీలో ముందుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!