కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న వేళ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్ లో టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అధికార వర్గాల ప్రకారం 28 మందిని పొట్టనబెట్టుకున్నారు. ముష్కరుల కాల్పులతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగింది. అక్కడి స్థానికులు భయంతో వణికిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి రోధనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉగ్రదాడిని ట్రంప్ తో సహా ప్రపంచ ప్రముఖులు ఖండించారు. ఉగ్రవాదుల దాడులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించింది.
Also Read:KTR: కేసీఆర్ను చూడడానికి ఆయన మాటలు వినడానికి జనం సిద్ధమవుతున్నారు..
అయితే ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న శత్రుదేశం పాకిస్తాన్ కాశ్మీర్ పై ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది దాయాది దేశం. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు పాక్ నాటకాలు ఆడుతోందని పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. పాకిస్థాన్ ది దొంగ ఏడుపు అంటూ ఏకిపారేస్తున్నారు. కాగా దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. ఉగ్రమూకలకు పాకిస్థాన్ ఐఎస్ఐ సాయం చేసింది. రక్తపాతం సృష్టించి ఏమీ తెలియనట్లు సానుభూతి ప్రకటించింది పాకిస్థాన్.