Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ (విరుష్క) జంటకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లయి ఇన్నేళ్లయినా ఈ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తన భర్త విరాట్ కోహ్లీని, ఆర్సీబీ టీమ్‌ను ఉత్సాహపరచడానికి అనుష్క శర్మ మైదానానికి వచ్చారు. అయితే.. మ్యాచ్ సమయంలో గ్యాలరీలో కూర్చున్న ఆమె వేలికి ఉన్న ఒక వింత ఉంగరం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆధ్యాత్మికతతో కూడిన లేటెస్ట్ గాడ్జెట్..
సాధారణ దుస్తుల్లో మెరిసిన అనుష్క శర్మ, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నంత సేపు ఆర్సీబీ విజయం కోసం ప్రార్థిస్తూ కనిపించారు. ఈ క్రమంలో ఆమె చూపుడు వేలికి ఉన్న డిజిటల్ రింగ్ కెమెరాల కంటికి చిక్కింది. నెటిజన్లు దీని గురించి ఆరా తీయగా.. అది కేవలం ఒక అందమైన నగ మాత్రమే కాదు, అంతకు మించిన ఉపయోగం ఉన్న ఒక లేటెస్ట్ గాడ్జెట్ అని తేలింది. దీనిని ‘రాధా నామ్ జప కౌంటర్ రింగ్’ లేదా ‘డిజిట్ జప మాల’ అని పిలుస్తారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇలా పనిచేస్తుంది..
సాధారణంగా దేవుడి నామాన్ని లేదా మంత్రాలను జపించడానికి రుద్రాక్షలు, స్ఫటిక మాలలను వాడుతుంటారు. కానీ ప్రయాణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అది కుదరదు. అందుకే ఈ ఆధునిక సాంకేతిక పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిని వేలికి ఉంగరంలా ధరించి, ప్రతిసారి మంత్రాన్ని పఠించినప్పుడు అందులోని బటన్‌ను నొక్కితే చాలు.. ఎన్ని సార్లు జపించామో అనే సంఖ్య దానికి ఉన్న చిన్న డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆన్లైన్ మార్కెట్లో ఇది కేవలం రూ.150 నుంచి రూ.200 ధరలోనే లభిస్తుంది.
ఆధ్యాత్మిక మార్గంలో ‘విరుష్క’ జంట…
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ దీవెనలతో రాధావల్లభ సంప్రదాయాన్ని అమితంగా విశ్వసించే విరాట్, అనుష్కలు ఈ మధ్యకాలంలో పూర్తి ఆధ్యాత్మిక భక్తులుగా మారిపోయారు. గతంలో బృందావనం సందర్శించినప్పుడు విరాట్ కోహ్లీ చేతిలో కూడా ఇలాంటి జప కౌంటర్ కనిపించింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఫైనల్‌కు చేరాలంటూ అనుష్క ఈ రింగ్‌తో మైదానంలోనే ‘రాధా నామ జపం’ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా భర్త విజయం కోసం అనుష్క చేసిన ఈ డిజిటల్ జపం ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!