Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక కుట్రదారు, ఉగ్రవాది అయిన పాక్-కెనెడియన్ తహవూర్ రాణాని భారత అధికారులు గురువారం అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. అమెరికా న్యాయస్థానాల్లో భారత్‌కి అప్పగించకుండా ఉండేందుకు అన్ని న్యాయ సదుపాయాలను రాణా ఉపయోగించుకున్నాడు.
TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ సంవత్సరాల కృషి మూలంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అమెరికా భారత్‌కి అప్పగించింది.
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో 166 మంది మరణానికి కారణమైన పాక్-కెనెడియన్ ఉగ్రవాది తహవూర్ రాణాని భారత్‌కి తీసుకువచ్చారు. అమెరికా అతడిని ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం భారతీయ అధికారులు, రాణాని ఢిల్లీకి చేర్చారు. ఇతడిని ప్రశ్నించేందుకు ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి.
ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చారు.
Tahawwur Rana: అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావుర్ హుస్సేన్ రాణాను భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 10) అతను భారత్‌కు చేరుకుంటాడని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌ను దుర్మార్గపు ఆలోచనలను బయటపెట్టారు. న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే ఉగ్రవాదానికే బలవుతుందన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారన్నారు.
Pakistan: ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి స్వర్గధామం అయిన పాకిస్తాన్లో ఇప్పుడు వారికి రక్షణ కరువైంది. ముఖ్యంగా భారత వ్యతిరేక టెర్రరిస్టులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి చేరడం లేదు. ‘‘అజ్ఞాత వ్యక్తుల’’ లేదా ‘‘గుర్తు తెలియని వ్యక్తుల’’ దాడుల్లో వరసగా మరణిస్తున్నారు. సింపుల్‌గా బైక్‌పై వచ్చే వీరి, ఉగ్రవాదిని దగ్గర నుంచి కాల్చివేసి, వేగంగా అక్కడి నుంచి పారిపోతున్నారు. అసలు వీరు ఎవరనే విషయం ఇప్పటికీ పాక్ ప్రభుత్వానికి, దాని గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి అస్పష్టంగా…
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ భారత్‌ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది. కొత్త పాలకుడు మహ్మద్ యూనస్ భారత్ టార్గెట్‌గా గేమ్స్ ఆడుతున్నాడు. దీనికి తోడు ఆయనకు మద్దతు ఇస్తున్న మతోన్మాద సంస్థలు జమాతే ఇస్లామీ, బీఎన్పీ వంటి పార్టీలు భారత్ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూనస్ పాకిస్తాన్, చైనాకలు పెద్దపీట వేస్తున్నాడు.
Saudi Arabia: హజ్ భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది హజ్ తీర్థయాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ నిషేధం ఉంటుంది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతో పాటు వ్యాపార మరియు కుటుంబ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. సరైన రిజస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఈ దేశాలకు…
వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, బ్యాంకాక్, చైనా వంటి దేశాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మయన్మార్, బ్యాంకాక్ అతలాకుతలం అయ్యాయి. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే పాకిస్తాన్ లో భూకంపం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలూచిస్తాన్‌లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS…