తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని అన్నా రోడ్డులో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందంటూ ఒక్కసారిగా ఐదు అంతస్తుల భవనం నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో అన్నా రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో టోర్నీలో 9వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నిరంతర వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడలేదు. టాస్ పడకముందు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ ఎడతెరిపి ఇవ్వకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలు చూస్తే, రాబోయే కొన్ని రోజుల్లో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర అసహనంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంది. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతుల్లో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్థాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఫైర్ అయ్యారు. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనమైందని మండిపడ్డారు.…
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్‌కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ని కొట్టలేకపోతోంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం. Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య…
Bangladesh : రంజాన్ కు ముందు బంగ్లాదేశ్ లోని యూనుస్ ప్రభుత్వం పాకిస్తాన్ తో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ 50వేల టన్నలు బియ్యాన్ని బంగ్లాదేశ్ కు విక్రయించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు వరుస షాకులు తగిలాయి. గ్రూప్-ఎలో ఉన్న పాక్.. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన దాయాది జట్టు.. సెమీస్ రేసులో చాలా వెనకబడి పోయింది. దాదాపుగా పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్లే. అయితే ఎక్కడో చిన్న ఆశ పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలను చూపిస్తోంది. నేడు…