Pakistan vs India : భారత్ ఔషధాల ఎగుమతి నిలిపేస్తే పాకిస్థాన్ పరిస్థితి అంతే?
- పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతిస్పందన
- పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేత
- దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత
- నివారించేందుక చర్యలు తీసుకుంటున్న పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. మరోవైపు.. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా.. ఇస్లామాబాద్ కూడా న్యూఢిల్లీతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. కానీ ఔషధాల దిగుమతుల అంశంపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ నుంచి వచ్చే మందులుపై ఆధారపడుతోంది.
READ MORE: Sourav Ganguly-PCB: రంగంలోకి సౌరవ్ గంగూలీ.. ఇక పీసీబీ అడుక్కు తినాల్సిందే!
Also Read
భారతదేశంతో వాణిజ్యం నిలిచిపోయినందున.. పాకిస్థాన్‌లో ఔషధ అవసరాలను తీర్చడానికి తక్షణ చర్యలు ప్రారంభించామని, ఆరోగ్య అధికారులు సరఫరాలను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారని జియో న్యూస్ నివేదించింది. భారత్ నుంచి వచ్చే ఔషధాలపై నిషేధం గురించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదని.. ఒకవేళ నిషేధిస్తే.. అత్యవసర ప్రణాళిక ఇప్పటికే సిద్ధంగా ఉందని పాకిస్థాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ (DRAP) తెలిపింది.
READ MORE: Naga Chaitanya : నా మూవీలో నాగచైతన్య లేరు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!
2019 సంక్షోభం తర్వాత.. తాము అలాంటి పరిస్థితులకు ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీఆర్ఏపీ సీనియర్ తెలిపారు. ఔషధ అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం, పాకిస్థాన్ ఔషధ పరిశ్రమ దాని ముడి పదార్థాలలో 30% నుంచి 40% వరకు భారతదేశంపై ఆధారపడి ఉంది. వీటిలో క్రియాశీల ఔషధ పదార్థాలు (API), వివిధ అధునాతన వైద్య ఉత్పత్తులు ఉన్నాయి.
READ MORE: PM Modi AP Tour: 15 నిమిషాలు రోడ్డు షో.. గంట పాటు సభ!
పాకిస్థాన్ ఔషధ అవసరాలను తీర్చడానికి చైనా, రష్యా, అనేక యూరోపియన్ దేశాల నుంచి ప్రత్యామ్నాయ వనరుల కోసం వెతుకుతోంది. అందులో యాంటీ-రాబిస్ వ్యాక్సిన్లు, యాంటీ-స్నేక్ వినం, క్యాన్సర్ చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇతర కీలకమైన జీవ ఉత్పత్తులు ఉన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉందని చెబుతున్నప్పటికీ.. భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేయడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్య తీసుకోకపోతే.. పెద్ద సవాలు తలెత్తవచ్చని ఔషధ పరిశ్రమ వర్గాలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
READ MORE: PM Modi AP Tour: 15 నిమిషాలు రోడ్డు షో.. గంట పాటు సభ!
“పాకిస్తాన్ మందుల కోసం 30-40% ముడి పదార్థాలను భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, టీకాలు, సీరమ్‌లు, రాబిస్ నిరోధక వ్యాక్సిన్, పాము విష నిరోధకాలను దిగుమతి చేసుకుంటాం. భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. కానీ.. ఔషధ దిగుమతుల స్థితిని స్పష్టం చేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇంకా ఎటువంటి అధికారిక సూచనలు అందలేదు. ఇది నిలిపి వేస్తే.. తీవ్రమైన ఔషధాల కొరతకు దారితీయవచ్చని ఔషధ పరిశ్రమ భయపడుతోంది.” అని పాకిస్థాన్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు