Pakistan: రంజాన్ మాసంలో పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. నిజానికి టెర్రరిస్టుల్ని చూస్తే ప్రజలు భయపడాలి కానీ, పాకిస్తాన్లో మాత్రం బయటకు వెళ్లాలంటే ఉగ్రవాదులు భయపడి చస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్చి చంపుతారో తెలియడం లేదు. గత కొన్నేళ్లుగా ఒకే విధంగా ఉగ్రవాదుల్ని అజ్ఞాత వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్‌ని సౌదీ అరేబియా,…
Pak vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఓడిన తర్వాత కూడా పాకిస్తాన్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. నేటి నుండి మొదలైన వన్డే సిరీస్ పైనే ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు మరోమారు నిరాశే మిగిలింది. మైదానం మారింది, పాకిస్తాన్ జట్టులో మార్పులు వచ్చినా వారి ఓటముల పరంపర మాత్రం ఆగలేదు. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లు జట్టులోకి…
EAM Jaishankar: పాకిస్తాన్లో మైనారిటీల అణచివేతపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో మాట్లాడారు. పాకిస్తాన్ మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరునను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని శుక్రవారం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో, పాకిస్తాన్లో మైనారిటీలపై నేరాలు, దౌర్జన్యాలపై సమాధానం ఇస్తూ.
Pakistan: వరస దాడులతో పాకిస్తాన్ కుదేలవుతోంది. బలమైన ఆర్మీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పాక్ ఆర్మీ బలం ఇటీవల ఘటనలతో తేలిపోయింది. ముఖ్యంగా బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషర్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దాడులకు తట్టుకోలేకపోతోంది. మొన్నటికి మొన్న బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ చేసిన బీఎల్ఏ ఏకంగా 200కి పైగా ఆర్మీ, ఐఎస్ఐ ఆఫీసర్లను చంపేసింది. ఆ తర్వాత భద్రతా బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 90 మందిని హతమార్చింది.
Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ భయాన్ని రుచి చూపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వచ్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. బయటకు వెళ్తే, తిరిగి ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు అక్కడి ఉగ్రవాదుల్లో ఉన్నాయి. దీంతో కీలకమైన ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్స్ వెళ్లారు. మరికొందరికి పాక్ ఐఎస్ఐ, ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌కి అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సోమవారం యూఎస్ కాంగ్రెస్‌లో జో విల్సన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మాజీ సెనెటర్ తన ఫిబ్రవరి డిక్లరేషన్‌లో, సోమవారం అమెరికన్ పార్లమెంట్లో ‘‘పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్’’ని తీసుకువచ్చారు.
Zakir Naik: భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్‌కి దాయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్లో జకీర్ నాయక్, మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్‌లను కలిసిన తర్వాత భారత్, పాకిస్తాన్ వైఖరి ఏమిటో తెలిసిందని వ్యాఖ్యానించింది.
Congress: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీ(పీపీపీ) అని బీజేపీ విమర్శించింది. పాకిస్తాన్ దేశ జాతీయదినోత్సవం వేళ ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వివాదాస్పదంగా మారింది. ఆ కార్యక్రమానికి ప్రముఖ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ హాజరైన తర్వాత బీజేపీ తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ‘‘ఇది భారత జాతీయ కాంగ్రెస్ కాదు, ఇది పీపీపీ- పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీగా మారింది’’ అని దాడి చేసింది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది