Hanif Abbasi: “భారత్ కోసమే 130 అణుబాంబులు” పాకిస్థాన్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు
- సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్
- తీవ్రంగా కలత చెందుతున్న పాకిస్థాన్
- పాకిస్థాన్ నాయకులు వరుస ప్రకటనలు
- భారత్‌పై దాడి చేస్తామంటూ వ్యాఖ్యలు
- తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.
READ MORE: Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరీ మూవీలో మరో స్టార్ బ్యూటి..
Also Read
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
“మా క్షిపణులన్నీ భారతదేశం వైపు వెళ్తున్నాయి అని హనీఫ్ అబ్బాసి అన్నాడు. భారతదేశం ఏదైనా సాహసోపేతమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటే.. దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. తమ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబులు ఉన్నాయని హెచ్చరించాడు. తాము గోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులను, 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటు, తమ సరిహద్దులను రక్షించుకోవడానికి తాము పూర్తి సన్నాహాలు చేస్తున్నామన్నాడు. పహల్గాం దాడి కేవలం ఒక సాకు మాత్రమే అని.. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుందని ఆరోపించాడు.
READ MORE: Ramayana : ‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు గట్టిగా ప్లాన్ చేస్తున్నా మూవీ టీం..
పాకిస్థాన్ సైన్యం అవసరం అనిపించినప్పుడల్లా రైల్వేను ఉపయోగించుకోవచ్చని హనీఫ్ ప్రకటించాడు. పాకిస్థాన్ రైల్వేలు సైన్యానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నాడు. హనీఫ్ అబ్బాసి పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నాయకుడు. జమాతే ఇ ఇస్లామీ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2008లో PML-Nలో చేరాడు. జూన్ 2012లో 500 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అబ్బాసిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!