India Pakistan: పాకిస్తాన్‌లో వధువు, బోర్డర్‌లో వరుడు.. పెళ్లి కష్టమే..
- పహల్గామ్ దాడితో క్రాస్ బోర్డర్ పెళ్లిళ్లపై ప్రభావం..
- పెళ్లి కోసం బోర్డర్‌లో ఎదురుచూస్తున్న వరుడు..
- సింధ్ ప్రావిన్సులో వధువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ నిర్ణయం పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తోంది. 1947లో దేశ విభజన జరిగినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా మంది పాకిస్తాన్ అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరిపై పహల్గామ్ ఎటాక్ ప్రభావం పడింది.
Also Read
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
Read Also: CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం..
రాజస్థాన్‌కి చెందిన షైతాన్ సింగ్ నాలుగు ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్సుకు చెందిన కేసర్ కన్వర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. వరుడి కుటుంబం వీసా కోసం అప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గురువారం ప్రభుత్వం అట్టారీ సరిహద్దుని మూసేయడంతో వివాహానిక మరో అడ్డంకి ఎదురైంది. పెళ్లికి సంబంధించి కొత్త బట్టలు సిద్ధం చేసుకుని, ఏప్రిల్ 30న పాకిస్తాన్‌లోని అమర్‌కోట్‌లో అమ్మాయి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం బార్మర్ జిల్లా నుంచి అట్టారికి బయలుదేరాడు. కానీ, వరుడి కుటుంబం అక్కడికి చేరుకునే సమయానికి బుధవారం అట్టారీ-వాఘా సరిహద్దు మూసేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు ఎవరిని సరిహద్దు దాటేందుకు అనుమతించడం లేదు.
ఈ దాడి రెండు కుటుంబాలపై ప్రభావం చూపించిందని వరుడి బంధువు సురేంద్ర సింగ్ అన్నారు. పాకిస్తాన్ నుంచి మా బంధువులు ఇక్కడికి వచ్చారు, వారు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని, దీంతో తాము చాలా నిరాశ చెందామని చెప్పారు. ఉగ్రదాడులు చాలా నష్టాన్ని కలిగిస్తాయని, సంబంధాలను దెబ్బతీస్తాయని అన్నారు. సైతాన్ సింగ్ వీసా మే 12 వరకు ఉంది. సకాలంలో సరిహద్దు తెరిస్తే వివాహం జరుగొచ్చని కుటుంబం అనుకుంటోంది. రాజస్థాన్‌లోని సోధా రాజ్‌పుత్ కమ్యూనిటీకి పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సుతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో సరిహద్దులు దాటి ఇలా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!