Pakistan Spy: భారతదేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి దొరికాడు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు తరన్‌తరన్‌లో అరెస్ట్ చేశారు.
Pakistan: పాకిస్తాన్‌కి భారీ దెబ్బ తగిలింది. కరుడుగట్టిన నేరస్తులు ఉండే కరాచీలోని మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. మాలిర్ జైలు లోపల హింసాత్మక దాడి జరిగిన తర్వాత సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఖైదీలు పోలీస్ అధికారులతో ఘర్షణ పడిన తర్వాత తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో, కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఖైదీలు జైలు ప్రవేశద్వారాన్ని బద్దలుకొట్టి పెద్ద సంఖ్యలో పారిపోయారు. జైలులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి.…
Pakistan: పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న…
BJP MP: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్‌లోని ప్రతీ ప్రాంతంలో ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని ఆయన ఆదివారం అన్నారు. భారతదేశం పట్ల పాకిస్తాన్‌కి భయం ఉందని, భారత్ తమను మళ్లీ విభజిస్తుందనే భయం వారిలో ఉందని అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం అప్పుల భారంతో నిండిపోయిందని, ప్రజలు ఆకలితో బాధపడుతుందని ఆయన అన్నారు.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
India-Pakistan: ఇటీవల ఇరాన్లో కనిపించకుండా పోయిన ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌లో పాకిస్తాన్ హస్తం ఉందా.? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) రాహుల్ గాంధీపై మాజీ కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్ లో ఫుల్ క్రేజ్ ఉందని, ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ తేడాతో గెలుస్తారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని వీడియోలు పాకిస్తాన్ మీడియాలో, అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రమోద్ కృష్ణం ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan Spy: హర్యానా యూట్యూబర్, పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ దొరికిన జ్యోతి మల్హోత్రా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ గూఢచారులు పట్టుబడుతున్నారు. రాజస్థాన్‌కి చెందిన కాసిం, అతడి సోదరుడు అసిం పాకిస్తాన్ తరపున గూఢచర్యానికి పాల్పడనున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసిం పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి శిక్షణ పొందడానికి రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Baloch Liberation Army: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బలూచ్ ఆర్మీ కంట్రోల్ పెరిగింది. క్వెట్టా వంటి రాజధాని మినహా చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి పట్టు లేదు. ఇప్పటికే, పాక్ ఆర్మీ టార్గెట్‌గా బీఎల్ఏ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, కీలకమైన సురబ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ యోధులు ప్రకటించారు. నగరంలో అనేక పోలీస్ స్టేషన్లు,…
భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.